Friday, September 11, 2026
E-PAPER
Homeఆటలుఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్..

ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (64) అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. షోర్నా అక్తర్ (22*) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, నందని శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే స్మృతి మంధాన (2) వికెట్‌ను కోల్పోయినా, షఫాలీ వర్మ తనదైన శైలిలో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఆమెకు జతగా ప్రతిక రావల్ (20) రాణించింది. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (24*), రిచా ఘోష్ (21), దీప్తి శర్మ (13) వేగంగా పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగుల మంచి స్కోరును నమోదు చేసింది. రేపు (సెప్టెంబరు 11) జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -