Friday, September 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు మృతి

ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగోలోని బుకావు నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రెండు పాఠశాలలకు మంటలు వ్యాపించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడినట్లు ప్రొవిన్షియల్ ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పాఠశాలలకు వ్యాపించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -