తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు.
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.
మే 1వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మీడియాతో సంభాషించారు.
షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రాసెస్‌లో రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నిటిపై ఆసక్తి ఏర్పడింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పని చేసే అవకాశం వచ్చింది. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా.
ఈ కథకి టిపికల్ హీరో అవసరం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్.. హీరోగా ఫీల్ అయితే ఆడియన్స్‌కు నవ్వు రావాలి. అలాంటి కథ, క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్‌కు తరుణ్ భాస్కర్ యాప్ట్. ఇందులో క్యారెక్టర్లు అన్నీ వాళ్ల లైఫ్‌లో చాలా సీరియస్‌గా ఉం టాయి. వారిని చూస్తున్నపుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వొస్తుంది.
ఇందులో తరుణ్ భాస్కర్ తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి, అక్కడ డిపోర్టేషన్‌కు గురై మళ్లీ ఇండియాకు వస్తాడు. ఏ కారణంతో అయితే తిరిగి వచ్చాడో, ఆ ఫ్రస్ట్రేషన్‌తో తీసుకునే నిర్ణయాలు ఎంత ఫన్ క్రియేట్ చేశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
జేడీ చేసిన ధర్మ పాత్ర పూర్తిగా డిఫరెంట్. అక్రమ రవాణాలో ఉండే క్యారెక్టర్. తరుణ్, ధర్మ ఈ రెండు పాత్రలు ఎలా కలుస్తాయనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే ఇది తెలిసిన కథలాగే అనిపించినా, అందులో జరిగే సంఘటనలు ప్రేక్షకులు ఊహించలేరు.
నిర్మాతలు కథకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి స్కేల్‌లో తీశారు. నేను ఊహించిన క్యారెక్టర్లకు సరిపోయే నటీనటులను ఇచ్చారు. సినిమా విషయంలో నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కథకి సీక్వెల్ చేసే అవకాశం ఉంది.
వాటిని ప్రేక్షకులు కూడా ఊహించలేరు
- Advertisement -
- Advertisement -



