Tuesday, April 21, 2026
E-PAPER
Homeసినిమాతండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం

తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం

- Advertisement -

మహేష్‌ చంద్ర సినిమా టీం బ్యానర్‌ పై దుండిగల్ల బాలకష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రాన్ని నిర్మించారు.
మహేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుక్న్ను ఈ సినిమాని మే 1న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.
ఈ క్రమంలో నిర్మాతలు దుండిగల్ల బాలకష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ‘మా దర్శకుడు జన సేన అభిమాని. పార్టీ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆయనది చేబ్రోలు. పవన్‌ కళ్యాణ్‌ని గెలిపిస్తే ఇదే ప్రాంతంలో షూటింగ్‌ చేస్తానని మాటిచ్చారు. అందుకే అక్కడే దాదాపు 75 శాతం షూటింగ్‌ చేశాం. హైదరాబాద్‌, గోవాల్లోనూ కొంత పార్ట్‌ షూట్‌ చేశాం. మహేష్‌ చంద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. భారీ తారాగణంతో కేవలం 45 రోజుల్లోనే కంప్లీట్‌ చేశారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఇందులో రాజకీయ అంశాలేవీ ఉండవు. తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం. ‘ప్రేయసిరావే’ లాంటి గొప్ప మూవీని తీసిన మహేష్‌తో వర్క్‌ చేయడం మా అదష్టం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -