Tuesday, April 21, 2026
E-PAPER
Homeసినిమాబ్యాంకుల్ని దోచే 'కర'

బ్యాంకుల్ని దోచే ‘కర’

- Advertisement -

ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు.
ఈ సినిమాని ఈనెల 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ బ్యానర్‌ మీద సిహెచ్‌ సతీష్‌ కుమార్‌, రాజేష్‌ కుమార్‌ బొబ్బర రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్‌ సంగీతాన్ని అందించారు. విఘ్నేశ్‌ రాజా, ఆల్‌ఫ్రెడ్‌ ప్రకాష్‌ సంయుక్తంగా ఈ కథను రచించారు. థేనీ ఈశ్వర్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌గా, శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటర్‌గా పని చేశారు.
ఈనెల 30న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతోన్నారు. త్వరలోనే ప్రమోషన్స్‌తో మేకర్స్‌ సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో వరుసగా బ్యాంకుల్ని దోచేసే దొంగగా ధనుష్‌ కనిపించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఈ బ్యాంకుల్ని ధనుష్‌ ఎందుకు దోచుకుంటున్నాడు అనేది వెండితెరపైనే చూడాలన్నట్లు ట్రైలర్‌ను కట్‌ చేశారు. ఈ చిత్రానికి రచన : విఘ్నేశ్‌ రాజా, ఆల్‌ఫ్రెడ్‌ ప్రకాష్‌, దర్శకుడు : విఘ్నేశ్‌ రాజా, సంగీతం : జీవీ ప్రకాష్‌, డీఓపీ : థేనీ ఈశ్వర్‌, ఎడిటర్‌ : శ్రీజిత్‌ సారంగ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -