Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంపుతిన్‌కు అరుదైన బహుమతి

పుతిన్‌కు అరుదైన బహుమతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన బహుమతి అందజేశారు. రష్యా రచయితలు, మేధావులను ప్రభావితం చేసిన ప్రాచీన తమిళ కావ్యం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద పుస్తకాన్ని ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. (Modi gifts Thirukkural to Putin) శుక్రవారం భారత్‌ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. బ్రిక్స్ సదస్సుకు ముందు ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ సందర్శన సమయంలో ప్రాచీన తమిళ కావ్యం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు ప్రధాని మోదీ బహుకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -