అయినా సోషలిజమే ఆ దేశ ప్రజల ఊపిరి
వెబినార్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం : జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అమెరికా తీవ్రమైన ఆంక్షలను నియంతృత్వంతో అమలుచేస్తున్నా మొక్కవోనీ పట్టుదలతో క్యూబన్లు సోషిలిజాన్ని కాపాడుకుంటున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. స్వయం సమృద్ధితోనే స్థానిక ప్రజలు తమ జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్ పర్యవక్షణలో ‘ఫెడల్ కాస్ట్రో శతజయంతి క్యూబా పర్యటన అనుభవాలు’ పేర వెబినార్ నిర్వహించారు. ఇటీవలి క్యూబా పర్యటన వివరాలను వెంకట్ ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం ఆదేశంలో నెలకొన్న పరిస్థితులు, పాలకులు, ప్రజలు ఐక్యంగా ముందుకుసాగిపోతున్న తీరును తెలియజేశారు. క్యూబా అంటే ఫెడల్ క్యాస్ట్రో, చేగువేరా అని చెప్పారు. తమ పర్యటనలో అనేక విషయాలను గుర్తించామని అన్నారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ,ప్రభుత్వం దేశంలో ప్రస్తుతం విద్యకు, వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం క్యూబా ఆర్థికంగా తీవ్ర ఒడిదుడికులను ఎదుర్కొంటున్నదని చెప్పారు. 2010 నుంచి అమెరికా ఆంక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పాలస్తీనా తదితరదేశాల నుంచి ఇప్పటికీ చదువుకోవడానికి విద్యార్థులు క్యూబాకు వస్తున్నారని చెప్పారు. అనేక కష్టాలను అనుభవిస్తున్నా తమను తాము రక్షించుకోవడానికి, సోషిలిజాన్ని ఉనికిలో ఉంచేందుకు క్యూబా ప్రజలు శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ, దీనికి కారణం అమెరికా ఆంక్షలేనని వ్యాఖ్యానించారు. 1959 విప్లవం వచ్చిన దగ్గర నుంచి 1995 వరకు దేశ ప్రజలకు అన్నీ రకాల సౌకర్యాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు ఆదేశ అధ్యక్షులు ఫైడల్ క్యాస్ట్రో శతజయంతిలో చెప్పారని చెప్పారు. నిరక్షరాస్యతను నిర్మూలించి, అక్షరాస్యతను బాగా అమలుచేశారని చెప్పారు. చెరుకు, పొగా పంటలను ఎక్కువగా సాగు చేస్తారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన వైద్యం క్యూబా అందుబాటులో ఉందన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 700 మందికి ఒక డాక్టర్ ఉంటే, క్యూబాలో 100 మందికి ఒకరు ఉంటారని చెప్పారు. క్యూబాలో కుటుంబ వైద్య వ్యవస్థ ఇప్పటికీ అందుబాటులో ఉందనీ, అందుకే స్థానిక ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అమెరికా నియంతృత్వ విధానాల మూలంగా ప్రస్తుతం పరిస్థితి మారుతున్నదన్నారు. పర్యాటక ప్రధానంగా ఉంటుందనీ, అయితే విద్యుత్, కరెంటు, నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీడీపీలో 76 శాతం ఆదామం విదేశాలకు వైద్యులను పంపి వైద్యం అందించడం ద్వారా సాధిస్తున్నారన్నారు. పర్యాటకం,పరిశ్రమలు, వ్యవసాయం నుంచి ఇంకొంత ఆదాయం వస్తుందన్నారు. ప్రపంచంతో పోటీపడి వైద్యాన్ని క్కూబా అందిస్తున్నదని చెప్పారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ధృవీకరించిందని అన్నారు. క్యాస్ర్టో పట్ల దేశ ప్రజలు అత్యంత అభిమానంగా ఉంటారని చెప్పారు. అదేస్థాయిలో చేగువేరాను గౌరవిస్తారని చెప్పారు. విప్లవం కేవలం క్యూబాకే పరిమితం కాకూడదనే కారణంగా చేగువేరా క్యూబాను వదిలి బొలివియా, వెనుజులా తదితర దేశాలకు వెళ్లారని చెప్పారు. క్యూబాకు ముడిసరుకులు అందకుండా అమెరికా అడ్డుకుంటున్నదని వివరించారు. విద్యార్థుల నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. క్యాన్సర్ తో బాధపడుతున్న విద్యార్థుల చదువు ఆగిపోకుండా ఉండేందుకు, ఆసుప్రతుల్లోనే ఉపాధ్యాయులను నియమించి విద్యను కొనసాగిస్తున్నారని చెప్పారు. క్యూబా ప్రజల వైద్య సర్వీసుల నేపథ్యంలో అమెరికా ప్రజలు అభిమానంతో ఉంటారని చెప్పారు. వనరులు తక్కువగా ఉన్నా అందరూ సమానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఇతర దేశాల నుంచి సాయం అందుకోవడానికి ఆ దేశ ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. పెట్టుబడులపై పర్యవేక్షణ ఉంచడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. గెరిల్లా పోరాటాలకు క్యూబా ప్రసిద్దగాంచిందన్నారు. స్థానిక ప్రజలతో సైన్యం తయారుచేశారని చెప్పారు. చిన్నదేశమైనా క్యూబాను నాశనం చేసే ప్రయత్నం చేసి అమెరికా భంగపడిందన్నారు. వియత్నాం చేతిలోనూ అదే పరిస్థితి అమెరికా ఎదుర్కొన్నదనేది చరిత్ర చెబుతున్నదన్నారు. పాలకులు, ప్రజలు కష్టాలను కలిసి పంచుకుంటున్నారని వివరించారు. ఇది అరుదైన విషయమని చెప్పారు. క్యాస్ట్రో పేరుతో ఆ దేశ ప్రభుత్వం పెద్ద మ్యూజియాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. అంతర్గత సంక్షోభం సృష్టింంచడం ద్వారా క్యూబాపై దాడి చేయాలని ఇప్పటికీ అమెరికా ప్రయత్నిస్తున్నదని తెలియజేశారు. క్యాస్ట్రో జయంతి నేపథ్యంలో క్యూబా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను ఆదేశ ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు.
అమెరికా ఆంక్షలతో క్యూబాకు కష్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



