- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒరాకిల్‌లో మళ్లీ ఉద్యోగాల కోత మొదలైంది. ఏఐ-ఆధారిత నగదు కొరత నేపథ్యంలో ఉద్యోగ కోతలపై మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఒరాకిల్ స్టాక్‌లో 40 శాతం వాటా ఉన్న ఛైర్మన్ లారీ ఎల్లిసన్ కోసం కొత్త షేర్ ట్రేడింగ్ కార్యక్రమాన్ని కూడా ఆ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 24 వరకు 50 మిలియన్ షేర్లను విక్రయించడానికి ఎల్లిసన్‌కు అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ 20వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
- Advertisement -


