– ఆక్రమణలతోపాటు పూడిక తొలగింపు
– 22 ఏండ్ల పోరాటం ఫలించిందన్న పూజారి నరహరి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అనేక ఆలయాలకు కొలువై ఉన్న జగద్గిరిగుట్టలోని కోనేరు(గుండం) కబ్జాకు గురవుతోందని.. కాపాడాలని అక్కడి గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి రోధిస్తూ వేడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం కోనేరు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అందులో పేరకుపోయిన పూడికను తరలించింది. దాదాపు 26 ట్రక్కుల వరకూ ఉన్న నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారాన్ని తొలగించి కోనేరుకు కొత్త కళను అందించింది. ఎకరా వరకూ ఉన్న కోనేరులో కొంత భాగం మట్టితో నింపింది. దాంతో పార్కింగ్ కోసం అక్కడి వారు వినియోగించుకుంటున్నారు. కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఫలించిన 22 ఏండ్ల పోరాటం
తమ 22 ఏండ్ల పోరాటం ఫలించిందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి ఆనందం వ్యక్తం చేశారు. కోనేరును చూడకుండానే జీవితం ముగుస్తుందేమోనని ఆందోళన చెందానని, ఇప్పుడు హైడ్రా రూపంలో కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకున్నారని అన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, కబ్జాలను తొలగించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వర్షాలు పడినప్పుడు గుట్టపై నుంచి వచ్చే నీరు కోనేరులో చేరుతుందని, బోర్లు వేసి అయినా కోనేరును నింపుతామని పూజారి చెప్పారు.
జగద్గిరిగుట్ట కోనేరుకు కొత్త కళ తెచ్చిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



