నవతెలంగాణ-హైదరాబాద్: మహిళ రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో మోడీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విపక్షాలు సదురు బిల్లులను వ్యతిరేకించాయి. దీంతో లోక్‌సభలో ఆ బిల్లు వీగిపోయింది. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపక్షాల తీరును నిరసిస్తూ ర్యాలీ తీస్తుండగా మహారాష్ట్ర(Maharashtra) జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓర్లీ ప్రాంతంలో నడిరోడ్డుపై బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. దీంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జాం అయింది. గంటల కొద్ది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ తన వాహనాన్ని వదిలేసి మంత్రి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగింది. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ అరిచింది. మీ వల్ల ట్రాఫిక్ జామైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల మంది వెయిటింగ్లో ఉన్నారని, ఖాళీ మైదానంలో ర్యాలీ పెట్టుకోండి అని సూచిందింది.
రోడ్డుపై బీజేపీ నేతల ర్యాలీ..మహిళ తీవ్ర ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



