Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘శ్రీలత..’ పాటకు సర్వత్రా ప్రశంసలు

‘శ్రీలత..’ పాటకు సర్వత్రా ప్రశంసలు

- Advertisement -

నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన ‘శ్రీలత..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటకు దక్కుతున్న ఆదరణపై మీడియాతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ, ‘ఈ పాట మా కుటుంబ సభ్యులకు బాగా నచ్చి, ఫోన్‌ చేసి అభినందించారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా పాటకు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుం దని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాసుది. మీరు ఇన్ని పాటలకు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. ఈ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగ పడేలా ఉండాలని అనుకున్నాం.

పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుది రాయి. లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరి చితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఈ చిత్రంలో ఆరు పాటలతో పాటు కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ఆల్బమ్ మొత్తం బాగా వచ్చింది. నాకు వ్యక్తిగతంగా పాటలన్నీ సంతృప్తినిచ్చాయి’ అని అన్నారు. ‘ఇప్పటి వరకు 40 చిత్రాలకు పాటలకు రాశాను. వాటిల్లో ‘తెలియదే తెలియదే’, ‘కంగారే పడ కురా’ పాటలు బాగా హిట్‌ అయ్యాయి. ఈ పాట రిలీజ్ కాగానే కాసర్ల శ్యామ్ మెసేజ్ పంపారు. లిరిక్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కొన్ని లైన్స్ బాగున్నాయని అభినం దించారు. ఈపాటకు అన్ని చోట్ల నుంచి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది. ఈ పాట రాసే ఛాన్స్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని లిరిక్ రైటర్ అలరాజు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -