హీరో వెంకటేష్, రైటర్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – ఏకే47’. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించేలా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
వెంకీ, త్రివిక్రమ్ మార్క్ వినోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



