నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కరరావు తనయుడు, కేబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్
వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కరరావు విశిష్ట స్థానం సంపాదించారని అన్నారు. ప్రజాసేవలో ఆయన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాదెండ్ల భాస్కర రావు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం
- Advertisement -
- Advertisement -



