నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఐ ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ విచారణను మమత అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. అయితే, ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ ఆ దాడిని అడ్డుకున్నారు. దాడి జరుగుతున్న ప్రతీక్ ఇంటికి వెళ్లి.. అక్కడి కీలక డాక్యుమెంట్లను మమత స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఐప్యాక్ ఆఫీస్ నుంచి కూడా కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.



