Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారదర్శకత లేని జనగణన.. విధుల కేటాయింపులు

పారదర్శకత లేని జనగణన.. విధుల కేటాయింపులు

- Advertisement -

– ఇబ్బందుల్లో సీనియర్ ఉపాధ్యాయులు
– మండల విద్యాధికారుల ఇష్టారాజ్యం ,ఏమి పట్టనట్లు తహశీల్దార్లు
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలోని కొన్ని మండల్లాకు చెందిన మండల విద్యాశాఖ కొన్ని యూనియన్ నాయకులకు వారికి నచ్చిన చోట జనగణన విధులను కేటాయించారని సీనియర్ ఉపాధ్యాయులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జనగణన విధుల కేటాయింపులో పారదర్శకత లేని కారణంగా అనేకమంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి కలెక్టర్ కు ముందు తమకు జరిగిన అన్యాయం తెలుపుతూ వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడానికి కారణం ఏమిటి ? అసలు జిల్లా యంత్రాంగం సరిగా నిబంధనలు అర్థం చేసుకోకపోవడమా.? లేక నిబంధనలు అనుసరించడంలో వైఫల్యమా? కలెక్టర్, ఆయా తాసిల్దార్లకు, మునిసిపల్ కమిషనర్లకు ఉపాధ్యాయులను పారదర్శకంగా నిష్పక్షపాతంగా విధులు కేటాయించాలని ఆదేశించినప్పటికీ,  ఎందుకు ఈ సమస్యలు తలెత్తున్నాయి?

తహసిల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, మండల విద్యాధికారులు ఇచ్చిన జాబితాను గుడ్డిగా అనుసరించడమే ముఖ్యకారణం అని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.  మండల విద్యాధికారులు వారికి నచ్చిన ( ప్రధాన సంఘం ఉపాధ్యాయులని ) వారి పేర్లను సిఫార్సు చేయడం  కనీసం సీనియారిటీని కూడా పరిగణించకుండా వారికి నచ్చిన వారికి విధులు కేటాయించడం జరుగుతుందనీ ఆరోపణలు ఉన్నాయి.  ఉదాహరణకు పల్వంచ మండలంలో ఒక ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ జూన్ నెలలో ఉంది. అతని పదవి విరమణ అనంతరం సెన్సెస్ విధులు ఎవరు నిర్వహిస్తారు ?
కనీసం  సీనియారిటీ అయిన పరిగణించారా అంటే అలా కూడా లేదు. నచ్చిన వారికి విధులు కేటాయించడం జరిగింది. అదే మండలంలో సీనియర్ ఉపాధ్యాయున్ని పక్కన్న పెట్టినట్లు సమాచారం.

మద్నూర్ మండలంలో విధులు కేటాయించి సీనియర్ వారిని కాదని జూనియర్ వారికి విధులు కేటాయించడం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో, కామారెడ్డి మండల పరిసర ప్రాంతంలో  ఆవాస ప్రాంతంలో పనిచేయడానికి  దగ్గర మండల నుండి ఉపాధ్యాయులను అనగా తాడ్వాయి, లింగం పేట్,మాచారెడ్డి ,పాల్వంచ, రాజంపేట్ మండల ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలో విధులు కేటాయించడం వెనుక అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య  హస్తం ఉంది అని స్పష్టం అవుతుందనీ పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విధులు కేటాయించిన సిబ్బంది జాబితా బహిర్గతం చేయకపోవడానికి కారణం ఏమిటి ?

జిల్లా కేంద్రంలో విధులు కేటాయించాల్సి అవసరం ఉన్నపుడు ఎందుకు రహస్యంగా కొందరి పేర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది? ఎందుకు తాము విధులు చేస్తామని ముందుకు వచ్చినా వారి నుండి దరఖాస్తులు తీసుకోలేదు? ఇలా వేరే మండల ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలో కేటాయించడం వెనక రహస్య ఒప్పందం, ఆర్థిక లావాదేవీలు జరగనీదే వేరే మండల ఉపాధ్యాయులను కేటాయించడం జరగదు అనే సందేహంనీ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పని చేస్తున్న మండలంలో విధులు కేటాయించడమే కష్టతరం అయినపుడు వేరే మండలంలో పైగా జిల్లా కేంద్రంలో ఏ ప్రాధిపదికపైనా విధులు కేటాయించారు అనేది అధికారులకే తెలియాలనీ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

పారదర్శకత ప్రకారమే జనగణనకు ఉపాధ్యాయులను కేటాయించడం జరిగింది. పల్వాల్ సాయి ఎంఆర్ఓ. జనార్ధన్.
జనగణన విధులలో ఉపాధ్యాయులను  పారదర్శకత ప్రకారమే నియమించడం జరిగింధి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే దానిని తిరిగి పరిశీలించాము. త్వరలో రిటైర్మెంట్ కాబోతున్న ఉపాధ్యాయుని జనగణనా విధులకు కేటాయించలేదు, ఆ ఉపాధ్యాయుని రిజర్వులో మాత్రమే ఉంచాం. జనగణనలో ఉపాధ్యాయులనే  నియమించడం జరిగింది. లింగంపేట తహశీల్దార్.

జనగణనలో ఉపాధ్యాయులే ఈ విధులకు అర్హులని ఉపాధ్యాయులని నియమించడం జరిగింది. వారిని నియమించడం సంబంధిత మండల విద్యాశాఖ అధికారి సూచనల మేరకే నియమించాం అందులో సీనియారిటీ, రిటైర్మెంట్ తదితర వాటి విషయాలను ఆ ఎంఈఓ నే చూసుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -