నవతెలంగాణ – హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సమ్మెకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘలా ఎన్నికలు, ఔట్ సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల వరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎన్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమే. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రావలసిన సుమారు రు. 400 కోట్లతో పాటు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించి, సంస్థను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలి. అద్దె బస్సుల మునుగులో సంస్థను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రయివేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడువుతున్నది.
ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి, వాటిని సంపూర్ణంగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలి. ఏండ్ల తరబడి కనీస వేతనాలు, చట్ట బద్దమైన సౌకర్యాలు లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ నియామకాలను వెంటనే చేపట్టి కార్మికులపై ఉన్న అదనవు పనిభారాన్ని తగ్గించాలి. గుర్తింపు సంఘం ఎన్నికలను జరవకపోవడం అంటే వారి హక్కులను కాలరాస్తూ, కార్మికుల గొంతు నొక్కడమే. ఇది కార్మిక వర్గం సాధించుకున్న చారిత్రక హక్కులపై దాడి. తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి.
సమ్మె కారణంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వ్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 39 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల, ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి నమ్మె విరమింపజేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.



