- Advertisement -
మనల్ని మనమే కలబోసుకుంటే
జీవితం ప్రేమమయం
మనం ఇతరులతో కలహించుకుంటే
బతుకు నరకప్రాయం
అసలు కాలం
ఎక్కడ ఆగిందని
జీవితాన్ని సర్ది చెప్పుకోవడానికి!
వాళ్ళు మనల్ని
దూరం పెట్టినప్పుడే
మన విలువేమిటో అర్థమవుతుంది
చేసిన మేలు
ఎవరికీ గుర్తు లేకపోయినా
వాళ్ళు నేర్పే గుణపాఠాలు మాత్రం
గెలుపు నిచ్చెనలుగా
ఎదగడానికి ఉపయోగపడతాయి
బాధల జ్వాలల్ని బూడిద చేసి
పెదవులపై చెరగని
చిర్నవ్వులతో పోరాడుదాం
బతుకుల్ని ఆత్మవిశ్వాసంతో వెలిగించి
వెన్నెల దీపాలుగా మలుద్దాం
ఎన్. లహరి, 9885535506
- Advertisement -



