Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్‌ సహకరించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సోమవారం నల్గొండలోని రామాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు అనుమతించేలా నాటి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరిగిందని మంత్రి ఆరోపించారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని వినియోగించుకునే హక్కులు, అవకాశాలను గత పాలకుల నిర్ణయాల కారణంగా కోల్పోయామని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు గత ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై వెంటనే కేసీఆర్‌ ప్రజలకు సమాధానంతో పాటు క్షమాపణ కూడా చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -