- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆమె సుమారు 10 నెలల పాటు సెలవు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె గైర్హాజరీతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో, అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే, అపార రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Advertisement -



