Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలువ్యవసాయ భూమిలో గంజాయి సాగు..ఇద్దరు అరెస్టు

వ్యవసాయ భూమిలో గంజాయి సాగు..ఇద్దరు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పొలంలో 1,245 గంజాయి మొక్కలను, 11 గ్రా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టగా, అంబురే పుండలిక్ వద్ద ఎండు గంజాయి లభించింది. విచారణలో కుమారుడు రమేశ్‌తో కలిసి గంజాయి సాగు చేస్తున్నట్లు తేలింది. నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -