Thursday, April 23, 2026
E-PAPER
Homeఖమ్మంమామిళ్ళవారిగూడెం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం 

మామిళ్ళవారిగూడెం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం 

- Advertisement -

హాజరైన ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

మండల పరిధిలోని ఎంపీపీ ఎస్ మామిళ్లవారి గూడెం పాఠశాలలో వార్షికోత్సవం ఎంఈఓ ప్రసాదరావు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ మండల స్థాయి టాలెంట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. నవోదయలో సీటు సాధించిన విద్యార్థిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఎండిఎం వర్కర్లు, స్వచ్ఛ మిత్రలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ గారు, జడ్పీహెచ్ఎస్ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. నరసింహం, ఉపాధ్యాయిని ఎల్. దివ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -