Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిజయ్‌ సేతుపతి వ్యాఖ్యలపై ‘విజయ్ టీవీ’ క్లారిటీ

విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలపై ‘విజయ్ టీవీ’ క్లారిటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ హోస్ట్‌ విజయ్‌ సేతుపతి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేపథ్యంలో ‘స్టార్‌ విజయ్‌’ టీవీ స్పందించింది. విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌ రియాలిటీ షో కేవలం వినోదం కోసమేనని, అందులోని సంభాషణలను ప్రస్తుత రాజకీయ వ్యవహారాలతో ముడిపెట్టవద్దని కోరింది. కాగా, కంటెస్టెంట్ల గేమ్‌ను ఉద్దేశించి విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. సాధ్యం కాని హామీలు ఇవ్వడం, సమస్యల నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అవి తమిళనాడు సీఎం, టీవీకే నేత విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ ఆ పార్టీ నేతలు విజయ్‌ సేతుపతిపై విమర్శలు చేశారు. తాజాగా ‘స్టార్‌ విజయ్‌’ టీవీ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -