నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై దాడుల కోసం ఇజ్రాయిల్‌కు అమెరికా బాంబులను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. రాబోయే ఆయుధ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్‌కు శక్తివంతమైన రెండువేల పౌండ్ల బరువున్న బాంబులను అందించాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు పేరు చెప్పేందుకు నిరాకరించిన ఇద్దరు అమెరికా అధికారులు మంగళవారం తెలిపారు. 2,000 పౌండ్ల (907 కిలోల) బరువున్న బాంబులలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లోతైన, భూగర్భ లక్ష్యాలను ఛేదించేలా రూపొందించగా, మరికొన్ని భూమిపైనే పేలి విస్తృత నష్టాన్ని కలిగించనున్నాయి. ఇంకా ఖరారు కాని రూ.280 కోట్ల (2.8 బిలియన్ రూపాయల) ప్యాకేజీలో భాగంగా 40,000 బాంబులు (20,000 ఎంకె84లు, 20,000 బిఎల్యు-117లు) ఉన్నాయని ఆ అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం గురించి కాంగ్రెస్‌కు అనధికారిక సమాచారం అందినట్లు వారు వెల్లడించారు. ఈ ఒప్పందంలో అధిక భాగానికి విదేశీ సైనిక నిధుల ద్వారా చెల్లింపు జరగనుందని అన్నారు. దీనిలో భాగంగా, అమెరికా పన్ను చెల్లింపుదారుల డాలర్లను ఇజ్రాయెల్‌కు ఇచ్చి, ఆ డబ్బుతో ఇజ్రాయెల్ తిరిగి అమెరికా నుండి ఆయుధాలను కొనుగోలు చేయనుందని వెల్లడించారు. ఈ ప్యాకేజీ గురించి ‘వాషింగ్టన్ పోస్ట్’ గతంలో నివేదించింది. తమ ఆయుధాలతో గాజాలో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనలతో బైడెన్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం బాంబుల పంపిణీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. రెండవసారి ట్రంప్ అధికారం చేపట్టిన అనంతరం తాజాగా ఇజ్రాయిల్‌కు బాంబులను సరఫరా చేసేందుకు ఆమోదించారు. గత సంవత్సరం, ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ సాధారణ సమీక్షను దాటవేసి, 35,500కు పైగా బాంబులతో కూడిన సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల అమ్మకానికి ఆమోదం తెలిపింది. అనంతరం జనవరిలో, ఇజ్రాయిల్‌కు ట్రంప్ ప్రభుత్వం మొత్తం 6.67 బిలియన్ల (సుమారు 667 కోట్ల ) విలువైన మొదటి విడత ఆయుధాల అమ్మకాలకు ఆమోదం తెలిపింది.
ఇజ్రాయిల్‌కు అమెరికా బాంబుల సరఫరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



