- మునిగిలవేడు విద్యుత్తు సబ్ స్టేషన్ ఏఈ సాగర్
నవతెలంగాణ-నెల్లికుదురు: మండలంలోని మునిగేలవేడు విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో ఈనెల 17న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని దీని సద్వినియోగం వినియోగదారుడు చేసుకోవాలని మునిగిలవీడు సబ్ స్టేషన్ ఏఈ సాగర్ బుధవారం తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్ల మార్పిడి, నూతన విద్యుత్ సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీస్ పేరుమార్పు, వినియోగానికి మించి అధిక మొత్తంలో వచ్చిన విద్యుత్ బిల్లులు, కేటగిరీ మార్పు, సర్వీస్ రద్దు, ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల పరిధి విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చైర్పర్సన్ కె. మాధవరావు, టెక్నికల్ మెంబర్ ఆర్. శేషారావు, ఫైనాన్స్ మెంబర్ ఎస్. సత్యనారాయణ, ఇండిపెండెంట్ మెంబర్ ఎం. రామారావు హాజరవుతున్నారని ఏఈ సాగర్ పేర్కొన్నారు.



