- Advertisement -
- జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్
నవతెలంగాణ-అచ్చంపేట: పాఠశాలకు వెళ్ళలేకపోయిన వారికి, మధ్యలో చదువు ఆపేసిన వారికి వయోజనులకు దూర విద్య ద్వారా 10. తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు చదువుకోవడానికి ఎలాంటి ఫైన్ ఫీజు లేకుండా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు పొందవచ్చు అని నాగర్ కర్నూల్ జిల్లా ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ బుధవారం నవ తెలంగాణతో తెలిపారు. ఈఈ అవకాశం చదువుకోవాలని ఆసక్తి ఉన్న యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 16 ఓపెన్ స్కూల్ సెంటర్లు ఉన్నాయి. 10వ తరగతిలో 258 మంది, ఇంటర్మీడియట్ లో సైన్స్ కోర్సులో 205, ఇతర కోర్సులలో 472. మొత్తం పదవ తరగతి ఇంటర్మీడియట్ లలో 935 మంది అడ్మిషన్ అయినట్లు కోఆర్డినేటర్ తెలిపారు.
- Advertisement -



