- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం వద్ద గురువారం జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో విషాదం చోటుచేసుకుంది. అప్రోజ్ (30), అతని కుమారుడు ఆరిష్ (7), బావమరిది ఆసిఫ్ (40) ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం, లోతును దృష్టిలో ఉంచుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



