- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్ టాంగెరాంగ్ నగరం బటుసెపెర్లోని లైటింగ్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మంటలు చెలరేగడంతో టాంగెరాంగ్ నగర విపత్తు నిర్వహణ సంస్థ 15 అగ్నిమాపక వాహనాలు, 60 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



