Thursday, September 17, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రియుడిని ఇనుపరాడ్డుతో కొట్టి..యాసిడ్‌ పోసి చంపిన ప్రియురాలు

ప్రియుడిని ఇనుపరాడ్డుతో కొట్టి..యాసిడ్‌ పోసి చంపిన ప్రియురాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : విజయనగరం జిల్లాలో దారుణ హత్య జరిగింది. ప్రియుడిని ప్రియురాలు హతమార్చింది. సహజీవనం చేస్తున్న జంట మధ్య ఘర్షణ జరిగి ఈ ఘటనకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరివిడి మండలం కందిపేటకు చెందిన దనాల రాములమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా మెలిగింది. అతడు కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు. కొంతకాలంగా రాములమ్మ, శ్రీను సహజీవనం చేస్తున్నారు. 

గురువారం తెల్లవారుజామున వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టింది. అనంతరం యాసిడ్‌ పోయడంతో తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములమ్మ పురుగుల మందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -