నవతెలంగాణ-వనపర్తి
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తిలో విద్యార్థినులకు మెడికల్ కోడింగ్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కోడింగ్ సీఈఓ మౌనిక మాట్లాడుతూ మెడికల్ కోడింగ్ రంగం, దాని ప్రాధాన్యత, భవిష్యత్‌లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.ఈశ్వరయ్య, వైస్ ప్రిన్సిపాల్ ఈ. రామరాజు యాదవ్, అకాడమిక్ కోఆర్డినేటర్ కె. దామోదర్ రెడ్డి సహకరించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ కె సి కోఆర్డినేటర్ ఎస్.స్వామి, సభ్యులు జి. సుష్మ, జి. యువరూప లక్ష్మి, కె. శ్రీనివాసులు, ఏఫ్ టి ఎం కె. నాగేంద్ర చారి పాల్గొన్నారు. విద్యార్థినులు మెడికల్ కోడింగ్ రంగంపై అవగాహన పెంచుకుని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మెడికల్ కోడింగ్‌పై విద్యార్థినులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



