Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఐఐటీ బాంబేకు చెందిన పవయీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల అతడు పరీక్ష హాల్‌లో మొబైల్‌ ఉపయోగించి దొరికిపోయాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

ఇనిస్టి్ట్యూట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో సంవత్సరం చదువుతోన్న సాహిల్‌ (19).. ఇటీవల పరీక్ష జరుగుతుండగా మొబైల్‌ ఫోన్‌ వినియోగించారు. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఇందుకు గానూ అధికారులు అతడిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టలేదు. అయితే, డిపార్ట్‌మెంట్‌ హెడ్‌.. సాహిల్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఇనిస్టి్ట్యూట్‌ అధికారులు పేర్కొన్నారు.

అయినప్పటికీ సాహిల్‌ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో చోటుచేసుకున్న నాలుగో మరణం ఇది. దీంతో నిన్న రాత్రి క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -