
నవతెలంగాణ – భువనగిరి.
ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి వారిలో చైతన్యం తీసుకురావడమే ప్రజానాట్యమండలి లక్ష్యం అని రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ప్రజానాట్యమండలి యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్య కళాకారుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల మధ్య స్నేహం శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌబ్రాతృత్వం, మానవ వికాసం, మనుషుల మధ్య సోదర భావం పెంపుకు కృషి చేస్తామన్నారు. మూడాచారాలు, మత విద్వేషాల మధ్య పెరుగుతున్న అంతరాలను రూపుమాపాలని ప్రకృతి పర్యావరణం పరిరక్షణ కోసం పునరకితం కావాలంటూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జీపు జాతను చేపడతామని శ్రీనివాస్ తెలిపారు. ప్రజానాట్యమండలి కార్యదర్శి చెక్క వెంకటేష్ అధ్యక్షత వహించి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామం కోసం ప్రజల పక్షాన నిలబడింది ప్రజానాట్యమండలి అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పాసిజానికి వ్యతిరేకంగా యుద్ధం వద్దు శాంతి ముద్దు అని అనేక కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రజలను జాగృతం చేసిందన్నారు. నేడు ప్రజా చైతన్యం కోసం ముందుకు సాగుతున్నదని సాంస్కృతిక సంఘం దేశం ముద్దుబిడ్డ బ్రిటిష్ ముష్కర్లను గడగడలాడించిన సర్దార్ భగత్ సింగ్ జయంతి సెప్టెంబర్ 27 నాడు రాజస్థాన్ రాష్ట్రం అల్వాల్లో ప్రారంభిస్తుందన్నారు. అనేక రాష్ట్రాల్లో జీపు యాత్ర నిర్వహించుకుంటూ దేశంలో ప్రజలను కలుసుకుంటూ కవులు కళాకారులను భాగస్వాములను చేస్తూ సంఘటిత అసంఘటితరంగా కార్మికుల సమస్యలపై ఇతివృత్తాలు చేసుకొని కళారూపాలను ప్రదర్శిస్తూ చివరగా గాంధీ వర్ధంతి జనవరి 30 నాటికి ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉందని తెలిపారు ప్రజల చైతన్యం కోసం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని తెలంగాణ ప్రజానాట్యమండలి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈనెల 27న జీపు యాత్ర హైదరాబాదులోని మగ్దూం మొహినుద్దీన్ విగ్రహం నుండి ప్రారంభమై మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర చేరుకుంటుంది
కళాకారుల ఆటపాటలు మాటల ద్వారా సభ జరుగుతుంది అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులు వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు స్థూపం వద్ద నివాళి అర్పించి బహిరంగ సభ నిర్వహిస్తూ గుండాల మండలం నుండి జనగాం జిల్లాకు చేరుతుందిఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్, జిల్లా అధ్యక్షులు బుష్పాకనరసింహ ఉప్పుల కొమురయ్య పాల్గొన్నారు.