Saturday, September 19, 2026
E-PAPER
Homeఖమ్మంఆయిల్‌ఫెడ్‌ రైతులకు జీవ ఎరువులపై 50 శాతం సబ్సిడీ

ఆయిల్‌ఫెడ్‌ రైతులకు జీవ ఎరువులపై 50 శాతం సబ్సిడీ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై జీవ ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయిల్ ఫెడ్డీఓ శబావత్ శంకర్ తెలిపారు. ట్రైకోడెర్మా,వామ్, మైకోరైజా జీవ ఎరువులను అర్హులైన రైతులు సబ్సిడీపై పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో నవతెలంగాణతో మాట్లాడుతూ.. ట్రైకోడెర్మా కిలో అసలు ధర రూ.250 కాగా, 50 శాతం సబ్సిడీ అనంతరం రైతు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, దీని మోతాదు ఎకరానికి రెండు కిలోలు లేదా ఒక్కో మొక్కకు 35 గ్రాములు గా సిఫార్సు చేసామని, అలాగే వామ్ మైకోరైజా కిలో ధర రూ.225 కాగా, సబ్సిడీ అనంతరం రైతు వాటాగా రూ.112.50 చెల్లించాలి. దీని మోతాదు కూడా ఎకరానికి రెండు కిలోలు లేదా మొక్కకు 35 గ్రాములు గా సిఫార్సు చేయడం జరిగిందని అన్నారు. 

అర్హత.. పత్రాలు
ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న ఆయిల్‌పామ్‌ తోటలు కలిగి ఉన్న రైతులు ఈ సబ్సిడీ కి అర్హులని ఆయిల్‌ఫెడ్‌ తెలిపింది. రైతులు ఎఫ్‌ – కోడ్‌, పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు తీసుకురావాలని సూచించింది.

ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి:
జీవ ఎరువులు అవసరమైన రైతులు ముందుగా నారావారిగూడెంలోని డివిజనల్‌ కార్యాలయంలో లేదా సంబంధిత క్షేత్ర సిబ్బంది వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎరువులు తీసుకునే సమయంలో రైతులు తమ వాటా నగదును చెల్లించి పొందవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -