– ఇరువర్గాలపై కేసులు.. డీజేకు ముందస్తు పోలీస్ అనుమతి తప్పనిసరి
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వినాయక విగ్రహ ఊరేగింపులో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఘటనపై ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్ తెలిపారు.
వినాయక చవితి, ఇతర పండుగల సందర్భంగా డీజే ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు. అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసినా, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.



