– డిప్యూటీ సీఎం భట్టీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలు తెలుసుకునేలా మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన తెలంగాణ గిరిజన సంస్కృతిపై భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు గొప్ప వారసత్వ సాంస్కృతిక చరిత్ర ఉందని తెలిపారు.