Sunday, September 20, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

‘పూటకుళ్ళవ్వ’ నవల ఆవిష్కరణ
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రచురించిన మాదారపు వాణిశ్రీ రచన ‘పూటకూళ్ళవ్వ’ నవల ఆవిష్కరణ ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, వీధి. 13,హిమాయత్ నగర్,హైదరాబాద్ నందు నిర్వహిస్తున్నారు. కె.ఆనందచారి , డా. ఎస్. రఘు, ఎం. వేద కుమార్, డా. కొండపల్లి నిహారిణి, డా. ఇడికోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొంటారు.
ఎం.వేద కుమార్, చైర్మన్‌, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్

సుద్దాల అశోక్‌ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ రాష్ట్రస్థాయి పురస్కారం
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్ఠాత్మక ‘బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక’ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 22న సాయంత్రం 5:00 గంటలకు కరీంనగర్ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జి.వి. శ్యాంప్రసాద్ లాల్‌ IAS, శ్రీమతి జానకి రెడ్డి హాజరవుతారు.

ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976-2026) జాతీయ సదస్సు
​తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో తెలుగుశాఖ ఆధ్వర్యంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ. ప్ర.), నల్లగొండలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976-2026) జాతీయ సదస్సు ఈ నెల 26న జరుగుతుంది. ఈ సమావేశంలో సముద్రాల ఉపేందర్, దేశపతి శ్రీనివాస్, డా. ఏనుగు నరసింహా రెడ్డి, డా. నామోజు బాలాచారి, కటుకోజ్వల మనోహరాచారి, డా. రావులపాటి సీతారాం, డా. పసునూరి రవీందర్, ఆచార్య పిల్లలమఱ్ఱి రాములు… తదితరులు పాల్గొంటారు.
డా. వెల్దండి శ్రీధర్, సదస్సు సంచాలకులు, 9866977741

ఈ నెల 27న దశాబ్ది సాహిత్య సంచిక ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య రంగంలో గత పదేళ్లుగా జరిగిన పరిణామాలు, సాహిత్య దశ, దిశ ఎలా వుంది అనే విషయాలపై ప్రత్యేక సంచిక ఈ నెల 27న ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరణ జరుగుతుంది.
పాశం రామారావు

మునిమడుగుల రాజారావుకు ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కారం
ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కారం 2026వ సంవత్సరానికి గాను మునిమడుగుల రాజారావు ఎన్నికయ్యారు. ఈ అవార్డును సెప్టెంబర్ 27న ఆదిలాబాద్‌‌లో నాగదాసు వర్ధంతి సభలో ప్రదానం చేయబడును.
డాక్టర్ ఉదారి నారాయణ ఉదారి,
నాగదాసు కుటుంబ సభ్యులు, 9441413666

ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావుకు జాషువా కవితా పురస్కారం
‘జాషువా కవితా పురస్కారం – 2026’ ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావుకు ఈ నెల 27న ప్రదానం చేస్తారు. ఈ సభ సాయంత్రం 4 గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. జాషువా విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా నాట్య మండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, కె.ఎస్.లక్ష్మణరావు, వి. రాం భూపాల్ తదితరులు పాల్గొంటారు.
పాశం రామారావు

డాక్టర్‌ అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ
డాక్టర్ అమృతలత – పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి (2026) కథల పోటీ నిర్వహించాలని సంకల్పించడమైంది. సకల ప్రాంతాల తెలుగు వారు ఈ పోటీకి తమ కథలను పంపించవచ్చు. కథలను నవంబర్‌ 5 ‌లోపు ‘‘ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం:3, బ్లాక్-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044. email: [email protected]’’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 94900 99327
గుడిపాటి, ఎడిటర్‌, పాలపిట్ట

రాయలసీమ కథల పోటీ
రాయలసీమ సమకాలీన స్థితిగతుల నేపథ్యంగా కథారచన పోటీలను రాయలసీమ ఉద్యమనేత, ప్రముఖ సాహిత్యకారులు డా. ఎం.వి రమణారెడ్డి స్మారకార్ధం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. నవంబర్ 10 వ తేది లోపు తమ‌ కథలను పంపాలి. వివరాలకు : 9963917187.
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక, అనంతపురం

2027 సంక్రాంతి కథలపోటీ
సాహితీకిరణం మాసపత్రిక సౌజన్యంతో నీహారికా ఫౌండేషన్‌ 2027సంక్రాంతి కథలపోటీ నిర్వహిస్తున్నది. కథలను అక్టోబర్‌ 31 లోపు ‘సంపాదకులు, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌-500102’ చిరునామాకు పంపాలి. వివరాలకు: 9490751681.
సంపాదకులు, సాహితీకిరణం

డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం – 2026
సింహప్రసాద్‌ ‌సాహిత్య సమితి నిర్వహిస్తున్న ‘డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం’ 2026 సంవత్సరానికి గాను వి. మల్లికార్జున్ కథా సంపుటి ‘ఇరానీ కేఫ్’ ఎంపికైంది. ఈ సభ అక్టోబర్‌ 14న రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక సభలో ఈ పురస్కారం అందజే‌స్తారు.
సింహప్రసాద్ కన్వీనర్, 9849061668

బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026
విద్యార్థిని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వారి రచనా ప్రతిభను ప్రోత్సహించేందుకు నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ” కథల పోటీ–2026’ నిర్వహిస్తుoది. అక్టోబర్ 14వ తేదీలోపు అందిన కథలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తాం. ఈ-మెయిల్: [email protected]; వాట్సాప్: 86866 64949 ( మిగతా వివరాలకు)
గరిపెల్లి అశోక్, కన్వీనర్, బాలచెలిమి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -