Sunday, September 20, 2026
E-PAPER
Homeదర్వాజస్వస్వరూపం

స్వస్వరూపం

- Advertisement -

ఏ ఉన్ముఖీకరణా లేని నీతి వాక్యంలా
మాధ్యమాలు
మనోవీధుల వెంట చల్లగాలిని ప్రవహింపజేస్తాయి
రాజు మారిండు
రాజ్యం మారుతుందని
పవనాలెలా వీస్తున్నాయో చూడండని
గాలి భాషను
అందంగా అనువాదం చేసి పెడతాయి.
పదేపదే మంత్రాంగ ప్రదక్షణం చేసేవాళ్లు
వెంటనే వేషాలు మార్చుకుంటారు.
నటనలు వినూత్నంగా ప్రదర్శిస్తూ
కొలువుకూటాలు చేరుకుంటారు.
రాజు
వేషగాళ్లను అనుమానాస్పదంగానే ఆహ్వానిస్తాడు
మత్తు ఎక్కగూడదని కోరుకొని మందు తాగిన వాడి పరిస్థితి రాజుది.
అవును వాళ్ళ స్వభావం వాళ్ళదే
రాజు స్వభావం మెల్లమెల్లగా
అలాగే మారుతుంది
రాజ్యం మునపటి రూపాన్ని
తొందర్లోనే సంతరించుకుంటుంది
ఏనుగు నరసింహారెడ్డి, 8978869183

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -