వక్ఫ్ ఆస్తుల పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలోని వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వము వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని అవాజ్ కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం అవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం భువనగిరి పట్టణంలోని దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ భవనంలో చర్చా  గోష్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ న్యాయవాది సామాజికవేత్త ఎంఏ రహీం హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కోట్లాది రూపాయల విలువగల వక్ఫ్ భూమి ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల భూమి అన్యాకాంతమైపోతుందని వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి జిల్లాలోని వక్ఫ్  భూములపై సర్వే నిర్వహించి వాటికి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వక్ఫ్  భూమి ఎంత ఉందో శ్వేత పత్ర విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న మైనార్టీల సామాజిక అవసరాలు తీర్చడం కోసం ఈ భూములను ఉపయోగించాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్  బోర్డు  జ్యుడీషియల్ హోదా కల్పించాలన్నారు. జిల్లాలో మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు ప్రత్యేకంగా గ్రీవెన్స్  డే నిర్వహించాలని సందర్భంగా ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని డిమాండ్ చూశారు.
ఆవాస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లా ఏర్పడిదాదాపు ఏడు సంవత్సరాలు అయినప్పటికీ జిల్లాలో ఇప్పటివరకు వక్ఫ్ బోర్డు కు సంబంధించిన జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం వలన కోట్లాది రూపాయల విలువ గల భూమి అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ దీని పరిష్కారం కోసం ఏ అధికారులను కలవాలని తెలియని దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. వెంటనే వక్ఫ్  బోర్డు కు సంబంధించిన ఒక జిల్లా అధికారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూములను కాపాడడం కోసం మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య పట్టణ మైనార్టీ నాయకుడు ఇగ్బాల్ చౌదరి సిపిఐ జిల్లా వర్గ సభ్యులు ఏషాల అశోక్ ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్,  వై ఎల్ ఎన్ ఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద ఆవాజ్ జిల్లా గౌరవ అధ్యక్షులు , ఎస్కే లతీఫ్ జర్నలిస్టు ఎస్.కె హమీద్ ఎండి పాషా ఎండి ముక్తార్ హుస్సేన్ ఎస్ డి ఉమర్, ఎస్.కె ఇమామ్, ఎండి అజ్మత్, ఎండి ఖలీల్, ఎండి కాజంఅహ్మద్, ఎండి గౌస్, ఎండి ఇబ్రహీం, ఎండి మదర్, ఎం డి అఫాన్, అబ్దుల్ రహమాన్, ఎండి జలాల్, ఎండి మహబూబ్, ఎండి షబ్బీర్, యాదగిరిగుట్ట కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్  పాల్గొన్నారు.
Spread the love