
మండలంలోని పులిగిళ్ళకు చెందిన ప్రవాస భారతీయులు కొలను కమలాకర్ జ్యోతి రెడ్డి లు పుట్టిన ఊరుపై మమకారంతో ఆ గ్రామంలోని పల్లె దవాఖానకు వైద్య పరికరాల నిమిత్తం తమవంతు సహకారంగా రూ.50 వేల రూపాయల విరాళం తన తల్లిదండ్రులు కొలను అమృత లక్ష్మరెడ్డి ల చేతుల మీదుగా వైద్యాధికారి సుమన్ కళ్యాణ్ కు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి రాం రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.