Monday, September 21, 2026
E-PAPER
Homeజిల్లాలువల్లెంకుంటలో ఆగని అక్రమ ఇసుక రవాణా.!

వల్లెంకుంటలో ఆగని అక్రమ ఇసుక రవాణా.!

- Advertisement -

మైనింగ్ శాఖకు సమాచారం ఇచ్చిన పట్టింపు కరువు
మైనర్ లతో అక్రమార్కుల దందా
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని వల్లెంకుంట గ్రామ పరిధిలోని మానేరు నుంచి ఇసుకను అక్రమంగా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడాలేకుండా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అనుమతుల మాటున అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు తీసుకెళ్లడానికి అనుమతులు ఉండగా..అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికి అది ఆచరణలో అమలు కావడం లేదు.

అక్రమంగా ఇసుకను డోజర్లతో తోడేస్తూ కాటారం, గారెపల్లి తదితర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం ఫోన్ ద్వారా మైనింగ్ ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఇసుక వ్యాపారులు డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలురతో సైతం ఇసుక దందాకు దిగి యథేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే బాధ్యత వహించేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -