Monday, September 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సంఘ సేవ వినాయకుని వద్ద సందడి 

సంఘ సేవ వినాయకుని వద్ద సందడి 

- Advertisement -

నవతెలంగాణ-ఆసిఫాబాద్ 
జిల్లా కేంద్రాల్లోనే 18 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పట్టణంలోని బజారు వాడి వినాయక మండపం సంఘ సేవ యువజన సంఘం వినాయకుని వద్ద సోమవారం సందడి నెలకొంది. జిల్లా ఎస్పీ నీతిక పంత్ పూజా సమయంలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డిసిసి విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, బిజెపి నాయకులు సిద్ధంశెట్టి సుహాసిని, సతీష్ బాబు, బిఆర్ఎస్ నాయకులు సరస్వతి, మున్సిపల్ కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, జాడి వినోద్, బాలకృష్ణ, కస్తూరి పుష్పలత, రాపర్తి కార్తీక్, నాయకులు చరణ్, శివకుమార్, జాలింషా, సాయికృష్ణ, నిఖిల్ లు పూజారి నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా ఎస్పీ తో పాటు నాయకులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పండగ వాతావరణం లో ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. 

అన్నదానంలో భక్తుల సందడి 
మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కాకుండా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మందికి పైగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -