- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఇందిరమ్మ కుట్టు మిషన్ల దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 30 చివరి తేదీ అని బీసీ సంక్షేమ శాఖ ప్రకటించింది. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. టిజిఓబి ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బీసీ మహిళలు ఇంటిముందే స్వయం ఉపాధి పొందే అవకాశాలను కల్పించడం, తద్వారా వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్వాలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
- Advertisement -



