Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

- Advertisement -

కొలనుపాకలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఖమ్మంలో సెప్టెంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ రైతులు, వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు. మంగళవారం కొలనుపాకలో జాతీయ మహాసభలకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగం, వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలు, రైతులు–ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా తీసుకుంటున్న విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రభావం దేశీయ వ్యవసాయ ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ రంగ పరిరక్షణ, వ్యవసాయ కూలీల సమస్యలు తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సమస్యలపై మరింత బలమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు జాతీయ మహాసభలు దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు మామిడాల సోమయ్య, జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్. సీత, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మామిడాల బాలమల్లేష్, జిల్లా నాయకులు బర్మ బాబు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, నాయకులు యెర్రంబెల్లి అయిలయ్య, పైస రామదాసు, మామిడాల ప్రవీణ్, మామిడాల మహేష్, బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -