Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలురక్తాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై చిరంజీవి ఘాటు స్పందన

రక్తాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణలపై చిరంజీవి ఘాటు స్పందన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తన సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌ ఫ్యాన్స్‌ మీట్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. తనపై, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై కొంతకాలంగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను దశాబ్దాలుగా నిస్వార్థంగా నిర్వహిస్తున్న బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తాన్ని విక్రయిస్తున్నారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. రక్తాన్ని విక్రయించడం ద్వారా తాను సినిమాల్లో అందుకునే పారితోషికానికి సమానమైన మొత్తాన్ని సంపాదించాలంటే ఎన్ని కోట్ల రక్తం ప్యాకెట్లను విక్రయించాల్సి వస్తుందో విమర్శలు చేసేవారు ఆలోచించుకోవాలని అన్నారు. ఎలాంటి విరాళాలు స్వీకరించకుండా తన సొంత కష్టార్జితంతోనే బ్లడ్‌ బ్యాంక్‌ను స్థాపించి నిర్వహిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. రక్తదానం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార వ్యాఖ్యలకు తాను ప్రాధాన్యం ఇవ్వనని, తాను చేస్తున్న సేవ, ధర్మమే తనను కాపాడుతుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -