- Advertisement -
నవతెలంగాణ-జన్నారం
జన్నారం ప్రభుత్వ కలప డిపోలో ఈ నెల 23న కలప బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎఫ్డిఓ రామ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేలంలో మొత్తం 182 కలప లాట్లను విక్రయించనున్నారు. వీటిలో సుమారు 45.449 క్యూబిక్ మీటర్ల టేకు కలప, 3.4 క్యూబిక్ మీటర్ల నాన్-టేకు కలప ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా నిర్ణయించిన నిబంధనలు, ధరావతు మొత్తాన్ని పాటించాలని సూచించారు.
కలప కొనుగోలు చేయాలనుకునే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతర ఆసక్తిగల వ్యక్తులు వేలంలో పాల్గొనాలని అటవీ శాఖ అధికారులు కోరారు. వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
- Advertisement -



