Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూడాలనుంది: నాని

ప్రేక్షకులతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూడాలనుంది: నాని

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : ప్రముఖ నటుడు నాని తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్‌’ ప్రీమియర్‌ షోను ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమాను వీక్షించాలని ఉందని నాని తెలిపారు. ప్రేక్షకుల కోసం రూపొందించిన సినిమాను వారితో కలిసి ఆస్వాదిస్తూ, వారి స్పందనలను ప్రత్యక్షంగా చూడటం నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సినిమా చూడటం ప్రత్యేకమైన అనుభవమని అన్నారు. ప్రీమియర్‌ షో సందర్భంగా ప్రభుత్వం సూచించే అన్ని నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇచ్చిన నాని.. తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -