నవతెలంగాణ-మల్హర్ రావు
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో అంగన్ వాడి కేంద్రాల్లో టీచర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మహదేవ్‌పూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నియామక పత్రాల పరిశీలన కొనసాగుతోందని సిడిపిఓ రాధిక బుధవారం తెలిపారు. ఈ క్రమంలో గురువారం మండలంలోని పెద్దతూండ్ల 2,3, చిన్నతూండ్ల-2, వల్లెంకుంట-1, ఎడ్లపల్లి-1, నాచారం-1, కొయ్యుర్ గ్రామాల అభ్యర్థులు ఈ నెల 24న హాజరై తమ ధృవపత్రాల పరిశీలన చేయించుకోవచ్చన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, సంబంధిత ధృవపత్రాల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అవసరమైన ఇతర సంబంధిత పత్రాలను అభ్యర్థులందరూ నిర్ణీత తేదీన తప్పనిసరిగా హాజరై సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు.
అంగన్ వాడి టీచర్ల దరఖాస్తుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



