నవతెలంగాణ – హైదరాబాద్ : ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ‘ఎంవీ కేప్ డావో’ అనే ఈ నౌకలో మొత్తం 20 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 19 మందిని సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. భారతదేశం వైపు ప్రయాణిస్తుండగా మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడంతో పాటు, మరణించిన నావికుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. రక్షించిన 19 మందిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటోందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మస్కట్‌లోని రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని, మృతుడి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని అధికారులు వివరించారు.
ఒమన్ తీరంలో భారత్ నౌకపై దాడి.. ఒకరి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



