Homeతాజా వార్తలుట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. గణేష్‌ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్‌ ఎస్‌ఐను గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టి పరారైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌ క్రేన్‌-2 వద్ద నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్‌ ఎస్‌ఐ కె. వెంకన్న (55)ను గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బైక్‌ ఆపకుండా నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకన్నను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బైక్‌, నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -