Homeఅంతర్జాతీయంపార్టీలో కాల్పులు..11 మంది మృతి

పార్టీలో కాల్పులు..11 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని క్వామాఖుతా పట్టణంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు బుధవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, మంగళవారం రాత్రి పట్టణంలోని జికో ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఒక ఇంట్లో 13 మంది పురుషులు, ఓ గర్భిణీ పార్టీ చేసుకుంటుండగా, ముగ్గురు సాయుధ దుండగులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారు. వారు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో గర్భిణీ సహా 10 మంది అక్కడికక్కడే మరణించారు.

గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై సౌత్ ఆఫ్రికన్ పోలీస్ సర్వీస్ యాక్టింగ్ నేషనల్ కమిషనర్ పులెంగ్ డింపేన్ తీవ్రంగా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు 72 గంటల ప్రత్యేక ఆపరేషన్‌కు ఆదేశించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించి, ఈ అమానుషానికి పాల్పడిన వారిని త్వరితగతిన పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -