Homeజాతీయంసీఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టులో పిల్

సీఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టులో పిల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కీలక నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపిస్తూ మీడియాలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా శైలేంద్రమణి త్రిపాఠి అనే అడ్వొకేట్ ఈ పిల్ వేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషిని సంప్రదించకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ నిర్ణయాలు తీసుకున్నారని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని త్రిపాఠి పేర్కొన్నారు.

ఇక ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమయంలో ఓటరు జాబితాల నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, ఆ వ్యవహారంపైనా ప్రత్యేక దర్యాప్తు బ‌ృందం (సిట్) తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో వైఫల్యం, నిర్లక్ష్యానికిగాను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద సీఈఓ జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -